Tuesday, August 11, 2015

రాజ కుమారుడు (దైవ కుమారుడు)– రెండవ భాగమురాజ కుమారుడు (దైవ కుమారుడు)– రెండవ భాగము


మొదటి భాగములో దేవుని వాక్కే దైవకుమారుడు అని తెలుసుకొన్నాము కదా! దైవకుమారుడే ఈ విశాల ప్రపంచమునంతటినీ సృజించారు. పాపానికి అతీతుడు దేవుడొక్కడే! అయితే, దేవునిలో పాపము లేనపుడు ఆయన సృష్టించిన ఈ ప్రపంచములోనికి పాపము ఎలా వచ్చినది? మొదటి  భాగములో చదువుకున్న”చెడిపోయిన దేవధూత” ఎవరు? అనే ధర్మ సందేహములు కలగటము సహజమే కదా! 

దేవుడు ఈ విశాల విశ్వాన్నిమరియు అనేక దేవధూతలని సృష్టించాడు. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచమంతటిని చూడవలెననుకొంటే అనంత కాలము సరిపోదు.  మన భూమి ఈ విశాల విశ్వములో ఒక్క అణువు మాత్రమే! ఇటువంటి భూములు కోట్లాధి కోట్లు! ఇప్పటిదాకా ఈ భూమి మీద పుట్టిన మనుషులు ఎంతమందని లెక్కించుట ఎలా అసాద్యమో అంతకంటే ఆసాద్యము ఈ భూములను లెక్కపెట్టడము. ఒక్కొక్క భూమిని ఎన్నెన్నోఅందాలతో తీర్చిదిద్దాడు ఆ దేవాది దేవుడు! మనలో ప్రతి ఒక్కరికీ మహోన్నతమైన భూములను సిద్దపరచే పనిలో నిరంతరము ఆయన కృషి చేస్తూనేవున్నారు. మనము వుంటున్నఈ భూమినే గమనిస్తే ఘంటసాల పాడిన ఈ పాట గుర్తుకురాదా? 

“భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు.. అదే ఆనందం! అదే అనుబంధం! ప్రభూ మాకేల ఈయవు..”

ఇంతటి ప్రపంచాన్నితిరిగి చూడగలిగిన శక్తిని ఇంకా దేవుడు మానవునికి ఇవ్వలేదు. కానీ దేవధూతలకు ఈ ప్రపంచాన్నితిరిగి చూడగలిగిన శక్తితో పాటు అనేక శక్తులను అనుగ్రహించాడు. వారు చేయవలసినది ఏమాత్రము కష్టము కాదు. హాయిగా ఈ ప్రమంచములోనున్న భూములలో తిరుగుతూ అనందిస్తూ, ఈ ఆనందాన్నిదేవుని సన్నిదిలో వ్యక్తపరచడానికి రోజుకు ఒక సారి దేవుడు నిర్ణయించిన ప్రదేశానికి రావడమే వారు చేయవలసిన పని. మొదటలో అందరు దేవధూతలు సమావేశానికి వచ్చి దేవునికి కృతజ్ఞ్యతా స్తుతుల చెల్లించి వారి ఆనందాన్నితోటి దేవధూతల తోను మరియు దేవునితోనూ పంచుకునేవారు. కాని రానురాను కొందరు దేవధూతలు బద్దగించడము మొదలుపెట్టారు. ఆ బద్దగించడానికి కారణములు వెతుకుట మొదలు పెట్టారు. మొదటగా “ఓ దేవా! నేను తిరిగి తిరిగి అలసి పోయాను. ఈ రోజు విశ్రాంతిని పొందగోరుచున్నాను. నేను మీ సన్నిధికి ఈ నాడు రావడం లేదు!” అనే సాకుతో మొదలు పెట్టి అసలు ఆ సమావేశానికి నేను ఎందుకు పోవాలి, ఆయనేమన్నా నా కంటే గొప్పా! ఆయనకున్న శక్తులు నాదగ్గర లేవా! అనే అహంకారభావము వారిలో ప్రవేశించడమే పాపానికి పునాధులు వేసినది. ఇలా వ్యతిరేకించిన వారు ఓ బలవంతుడైన దేవధూతను వారి నాయకుడుగా ఎన్నుకొని దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడము మొదలు పెట్టారు. ఆ బలవంతుడైన దేవధూతనే మొదటి భాగములో “చెడిపోయిన దేవధూత” గా సంబోధించాము. ఈయనకు ఇంత బలము ఎక్కడనుంచి వచ్చినది? ఎలావచ్చినదంటే, ఈయన దేవునికి ప్రీతి పాత్రుడు మరియు తన అద్భుతమైన గాత్రముతో దేవునికి అత్యంత సన్నిహితుడుగా ఉంటూ దేవుని మెప్పుని పొంది ఆయన శక్తులను బహుమతులుగా పొందుతూ అతి బలవంతుడైనడు. 

ఈ చెడిపోయిన దూతల సమూహము వూరకుండక దేవునికి సంబంధించిన దేవధూతలను హింసించి పోరాటము చేయడము వలన దేవుడు ఈ సమూహాన్నిపట్టి చెరసాలలో బంధించారు. మనము వీరి చరిత్ర చదువుతూ “ఈ బలవంతుడైన ధూత ఎంతటి మూర్ఖుడో!” అని అనుకోవడము సహజము. ఒక్కసారి ఆలోచించండి వీడికి మనకి పెద్ద తేడా లేదు!. ఉదయము లేసిన దగ్గరనుంచి దేవుడు చేసిన మేలులను ఆయన సృష్టిని అనుభవిస్తూనే వున్నాము. ఆయన జ్నానము మనకు ఇవ్వడము వలననే ఈ సెల్ ఫోన్, ఆ రేడియొ, ఈ కారు, ఆ విమానము, ఈ వైధ్యము.. ఆయన అనుదినము మనకు ఇస్తున్న జ్నానము వలననే ఇంత అబివృద్ది చెందిన మనము దేవునికి కృతజ్నతలు ప్రతి రోజు చెల్లిస్తున్నామా? ఆయనకు కృతజ్నతలు చెల్లించడానికి ఎక్కడకో పోనవసరము లేకుండా ఆయన మన హృదయములోనే వున్నప్పటికి మనలో చాలా మందికి కృతజ్నత చెల్లించుటకు తీరిక లేదు. అలాగే మనలో కొందరు దేవుడే లేడనే స్తితికి వచ్చారు. దేవుడే లేడు అనుకొన్నారు కాబట్టి సాటి మనిషిని హింసించినా చంపినా శిక్షే లేదు అని వాదిస్తున్నారు. ఇలాంటి మానవులమైన మనము కూడా బలవంతుడైన ధూత వుండిన చరసాల దగ్గరకు పయనిస్తున్నాము. ఇప్పుడాలోచించండి ఎవరు మూర్ఖులో!

ఇక్కడ మనము ఒక ముఖ్యమైన  విషయము గమనించాలి అది ఏమిటంటే దేవ దూతలు దేవుని వలన సృజించ బడి ఆయన అనుగ్రహించిన శక్తులు పొందిన వారు కాబట్టి వారు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట న్యాయము, ధర్మము మరియు శ్రేయస్కరము.  కానీ, దేవుడు ఎవ్వరికి కృతజ్ఞత చెల్లించవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన ఎవ్వరి వద్ద సహాయము పొందలేదు. ఇదే మనకి ఆయనికి మధ్య వున్న ముఖ్యమైన బేధము. దేవునిలో పాపము లేనప్పటికీ ఆయన స్త్రుస్టి అయిన మనలో కృతజ్ఞతా లోపము వలన పాపము ప్రవేశించినది. మనలను కని  పెంచిన తల్లితండ్రులను మరచి పోవుట కూడా పాపమే కదా! అది కూడా కృతజ్ఞతా లోపము వలననే కదా!

No comments :

Post a Comment