ఓ దేవా! నా సొంత నిర్ణయములతో పలు మారులు మీకు వ్యతిరేకముగా పాపము చేసి మరణ శిక్ష్యకు దగ్గరైతిని. మీ దయ వలన నా తప్పులు నేను తెలుసుకొంటిని.
ఈ జీవితము మీరు నాకు ఇచ్చిన భిక్ష. నన్ను మీరు రక్షించితిరి. మీ సహాయము లేని నా జీవితము వ్యర్ధము. మీరు నాలో నివశించండి. నాకు మార్గము చూపండి. నా సొంత ప్రయత్నములతో పరుమారులు పాపములో పడితిని. మీ సహాయము లేకుండా ఈ జీవితము కొనసాగించుట వ్యర్ధము అని తెలుసుకొంటిని. మీకు వ్యతిరేకముగా జీవించుటకన్నా మరణించుటయే మంచిది. కావున, నేను ఎప్పుడైనా మీకు వ్యతిరేకముగా పాప మార్గమున జీవిత ప్రయాణము మొదలపెట్టక ముందే నన్ను సరిచేయండి. సరిచేయ వీలు కానంతగా దూరమౌచున్నప్పుడు నా జీవితమును అంతటితో ఆపి నాకు ఈ లోక మరణమును దయచేయండి! నన్ను మీ దరికి చేర్చుకొనండి!
మీరు నన్నునడిపించు చున్నారన్న దైర్యముతో నేను జీవించుచున్నాను. అందువలన నేను ఎవరికిని భయపడను. మీరే నా రక్షణ కవచమైనప్పుడు ఎవరు నన్ను భయపెట్టగలరు?
“పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు! నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసు ప్రభు! పాపము మోసితివే నా శాపము బాపితివే నీ మహిమతొ పిలచితివే నీకు స్తోత్రము యేసు ప్రభు! చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను రా నంటిని నీ దరికి మన్నిచుము యేసు ప్రభు!”
“నీ కృప లేనిచో ఒక క్షణమైనను జీవించుటయే వ్యర్దమయా! నీ ప్రేమలేనిదే నే బ్రతుకలేనయ్యా! నాజీవితాంతము నీతోడు చాలయ్యా! ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవా! నేనెప్పుడును నిను విడువనయా!”
“ఓ దేవా! నా బలమా! యధార్థమైనది నీ మార్గం! పరిపూర్ణమైనది నీ మార్గం! నా శత్రువులు నను చుట్టినను నరకపు పాసము లరికట్టినను వరదవలె భక్తహీనులు పొర్లిన విడువక నను యెడబాయని దేవా! ఓ దేవా! నా బలమా! యధార్థమైనది నీ మార్గం! పరిపూర్ణమైనది నీ మార్గం!”

No comments :
Post a Comment