Saturday, September 3, 2016

యేసు ప్రభువు యొక్క బాల్య జీవిత చరిత్ర

యేసు ప్రభువు యొక్క బాల్య జీవిత చరిత్ర

                పరిచయము :-  ప్రతినిత్యము మనము బైబిలు గ్రంథములో చరిత్రను చదువుతూ ఉంటాముగాని సందర్భాలను వెనుకకు ముందుకు తీసుకొని తికమకపడేవారు అనేకులు కలరువారికోసము నేను చరిత్రను బైబిలు ఆధారముగా వ్రాసానుచరిత్రను క్లుప్తముగా చెప్పుచూ ప్రక్కన రెఫరెన్స్ను ఇచ్చానుఅనుమానము కలిగినవారు బైబిలు గ్రంథమును పరిశీలించి మరల చూచుకొనవచ్చును చరిత్ర అంతా బైబిలు గ్రంథములోనిదేగాని దానిని వరుస క్రమములో ఉంచుటకు చరిత్రను వ్రాయవలసి వచ్చిందికనుక పాఠకులు చరిత్ర అంతా చక్కగా మాకు తెలిసినదే అని అనుకోకుండ క్రీస్తు చరిత్రను పారాయణము చేయు అవకాశము మరొకసారి లభించినందుకు స్తోత్రము చెల్లించండిఅలాగే ఇందులో నాకు తెలియని కొన్ని సంగతులు వచ్చుట వలన నేను దీనిని వ్రాయుటకు మొదలుపెట్టానుకనుక మీకు తెలియవని కాదు గాని నాకు తెలియనివి బైబిలు గ్రంథములోనే ఉన్నవని పవిత్రాత్మ ద్వారా తెలియజేయుట వలన నేను మహదానందమును పొందితిని ఆనందములో మీరు భాగస్వాములు కాగలరని ఆశిస్తూ చరిత్రను మొదలుపెట్టుచున్నాను.

                యోహాను పుట్టుక గూర్చిన వర్తమానము :-  లూకా 1:5-23, 24-25, యోహాను 1:6.
                లూకాగారు సువార్తను మొదలుపెట్టుచూ యోహాను చరిత్రను క్షుణ్ణముగా వివరించాడుయోహాను జెకర్యా ఎలీసబెతుల యొక్క కుమారుడు జెకర్యా ఎలీసబెతులు బహు వృద్ధులుగా గొడ్రాలు జీవితములో ఉన్నారుఅయితే దైవప్రణాళిక కోసము వీరు నీతిమంతులైనను స్థితిని అనుభవించుట జరిగిందిదేవుని దృష్టికి వీరు నీతిమంతులు అని లూకా 1:6లో చదువగలముఅయినను వీరు పిల్లలు లేక జీవించారుదీనికి కారణము వీరు దైవప్రణాళికలో ఎన్నిక కావడమేఇలాంటి వీరి వద్దకు గబ్రియేలు అను దేవుని దూత పంపబడి వారు కనబోవు శిశువును గూర్చి చెప్పుట శిశువు ఏలియా అను పాతనిబంధన కాలములోని ప్రవక్తయొక్క ఆత్మశక్తి గలవాడై                జీవిస్తాడని తెలియజేయుట జరిగిందికాని లోకరీత్యా ఆలోచనతో నమ్మలేకపోవుట జెకర్యా చేసిన చిన్నపాటి తప్పుకు తన నోరు మూయబడి మాటలాడలేకపోవుట జరిగిందిఅటుతరువాత ఎలీసబెతు తన వృద్ధాప్య జీవితములో గర్భవతియై దేవుని స్తుతించుటను గూర్చి చదువగలముఇలాంటి శిశువును గూర్చి యోహాను 1:6లో దేవునియొద్ద ఉన్న మనుష్యునిగా గౌరవముగా వ్రాయబడినాడు.  (ఇది జరిగిన తరువాత సుమారు ఆరవ నెలలో దైవప్రణాళిక దైవకుమారుని జననమును గూర్చి సిద్ధము చేయబడింది కాలములో బాప్తిస్మమిచ్చు యోహాను తల్లి గర్భములో ఆరవ నెల ప్రాయమునకు ఎదుగుచున్నాడు.)

                క్రీస్తు ప్రభువును దేవుని వాక్యముగా చెప్పబడుట :-  యోహాను 1:1-5, 9, 14.
                వచనాలు క్రీస్తు ప్రభువును గూర్చినవిక్రీస్తు ప్రభువు దేవుని వాక్కుగా చెప్పబడుచున్నాడు. వాక్యము దేవుని నోటి నుండి వెలువడు మాటగా చెప్పుచూనే, వాక్కు లేక వాక్యము సమస్త సృష్టిని సృజించినట్లుగా చెప్పబడుచున్నాడుఅలాగే వాక్కు శరీరధారియై లోకములో జన్మించినట్లుగా కూడ చెప్పుచున్నారు.

                కన్య మరియమ్మ దైవకుమారునికి తల్లిగా ఎన్నిక :-  లూకా 1:26-39.

                సందర్భములోను గబ్రియేలను దేవదూత ఆరవ నెలలో అనగా ఎలీసబెతుకు యోహానును గర్భమందు ధరించిన తరువాత ఆరవ నెలలో కన్య మరియమ్మ వద్దకు వచ్చి దేవుని దయతో సంపూర్ణురాలుగా మారావని నీవు గర్భము ధరించి కుమారుని కని దేవుని కృపకు యేసు అని పేరు పెట్టుదువని తెలియజేయగా, పురుషుని ఎరుగక ఉన్న నాకు ఎలా సంభవించును అని ఆశ్చర్యముగా అడుగగా, ఆమెలో ఉన్న దైవప్రణాళికకు సంసిద్ధతను గుర్తించిన దూత జెకర్యాను శిక్షించినట్లుగా శిక్షించక, దేవునికి సాధ్యమని చెప్పుచు జెకర్యా భార్యయైన ఎలీసబెతు కూడ దేవుని దయ వలన గర్భము ధరించెనని ఇప్పుడు ఆమెకు ఆరవ నెల అని తెలియజేయుట జరిగింది విధముగా దైవకుమారుని  పుట్టుకను గూర్చి కన్య మరియమ్మను ఎన్నుకొనుట, ఆమె సమ్మతితో కన్య మరియ గర్భము నందు యేసుక్రీస్తు ప్రభువు శిశువుగా రూపొందుట జరగింది.  (ఇది నజరేతు అను గలిలయ ప్రాంతములోని ఒక ఊరుఅప్పటికే మరియమ్మ యోసేపుకు ప్రధానము చేయబడి యున్నదిఅనగా నిశ్చితార్థము జరిగియున్నది.)
                కన్య మరియమ్మ ఎలీసబెతును దర్శించుట :-  లూకా 1:39-56.
                విధముగా కన్య మరియమ్మ వర్తమానమును గబ్రియేలు దూత దగ్గర విన్న తరువాత దేవుని మహత్యమును చూచిన తన బంధువురాలు ఎలీసబెతును చూడాలని ఆమెను కలవాలని మనస్సునందు తలంచి యోసేపుతో తన నిశ్చితార్థము జరిగినను ఆమెకు వివాహము జరగలేదు సమయములో ఆమె దేవుని వాక్కుకు తన గర్భము నందు చోటు ఇచ్చుట జరిగింది తరువాత ఎలీసబెతు ఇంటికి వెళ్లి ఆమెకు వందనవచనములు పలుకుట జరిగింది సందర్భములో ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండగా ఆమె గర్భములోని శిశువుగా ఉన్న ఆరవ నెల యోహాను గంతులు వేసెనని చెప్పబడింది తరువాత ఎలీసబెతు మరియమ్మ ఇద్దరు కలసి వారి జీవితములో జరుగుచున్న అద్భుతములను గూర్చి దేవుని స్తుతించుట చేసారుఅటుతరువాత అక్కడ అనగా ఎలీసబెతు ఇంటిలో మూడు నెలలు సుమారుగా ఉండింది.  (కన్య మరియమ్మ గర్భము ధరించినది గలిలయలోని నజరేతు అను ఊరిలోగర్భము ధరించిన  తరువాత సుమారు మూడు నెలల కాలము ఎలీసబెతుతో యూదా ప్రదేశములోని కొండ సీమలో ఉండినదిఅక్కడ దేవునికి స్తుతులు చెల్లించుచు ఉన్నారు.)

                యోహాను జననము :-  లూకా 1:57-58.

                యోహాను ఎలీసబెతుకు జన్మించుటఇది వినిన ఆమె బంధువులు ప్రభువు ఆమెను కరుణించెనని చెప్పుకొని సంతోషించుట జరిగింది.  (యోహాను జననము యూదా ప్రదేశములోని కొండ సీమలో నున్న ఊరిలో జరిగింది.)

                యోహానుకు సున్నతి - పేరు పెట్టుట :-  లూకా 1:59-79.

                యోహాను పుట్టిన తరువాత సరిగ్గా ఎనిమిదవ దినమున సున్నతి చేసి గబ్రియేలు దూత ద్వారా తెలుపబడిన విధముగా యోహానను పేరు పెట్టుట జరిగిందిఅదే సమయములో జెకర్యా నోరు తెరవబడగా ఆయన దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడై స్తుతించుట చేసాడు.  ( విధముగా యేసుక్రీస్తు ప్రభువు కన్య మరియ గర్భములో ఉండగా నజరేతు నుండి ప్రయాణమై యూదా సీమలోని కొండ ప్రాంతములోని ఊరికి వచ్చింది రోజులలో ఉన్నట్లుగ ప్రయాణ సౌకర్యములు లేవు కనుక వారు కాలినడకన, గాడిద మొదలైన వాటిపై ప్రయాణము సాగించేవారుఇలా గలిలయలో నుండి యూదా సీమలోని కొండ ప్రాంతములోకి వెళ్లుటకు కొన్ని దినములు గడిచాయిఆమె వెళ్లి అక్కడ సుమారు మూడు నెలలు ఉన్నారు.   కాలానికి యోహాను జన్మించుట - ''సున్నతి పేరు పెట్టుట'' వంటి కార్యక్రమములు అక్కడనే జరిగినవి కనుక అవి అన్ని తాను దగ్గరగా ఉండి జరిగించుట చేసిందిఇందునుబట్టి యోహాను స్త్రీలు కనినవారిలో గొప్పవాడుగా కొనియాడబడినాడుఈయన జననము, సున్నతి, పేరు పెట్టుట వంటి కార్యక్రమాలకు మరియమ్మ ఆమె గర్భములో ఉన్న శిశువు అనగా క్రీస్తు ప్రభువు సమక్షములో జరిగినట్లుగా గ్రహించాలి విధముగా మరియమ్మ గర్భవతిగా సుమారు నాలుగు నెలల కాలము గడిచిందిఅనగా నజరేతు నుండి యూదా సీమకు వెళ్లిన కాలము + యూదా సీమ నుండి నజరేతుకు వచ్చిన కాలము)

                యోహాను బాల్యము నుండి యువకునిగా వృద్ధి చెందుట :-  లూకా 1:80.
                ఇందులో చెప్పబడిన విధముగా యోహాను శిశువుగా పుట్టి, ఎదిగి, ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుటకు ముందు సుమారు 30 సంవత్సరములు వచ్చుసరికి  ఏలీయా ఆత్మను బలమును పొంది బాప్తిస్మము అను కార్యక్రమమునకు పునాది వేసాడుఅంతవరకు లూకా 1:80 దేవునిచే పోషించబడుచు అరణ్యములో బ్రతికినట్లుగా మనము గుర్తించాలి.

                యోసేపు కన్య మరియమ్మపై అనుమానము నివృత్తి :-  మత్తయి 1:18-25.
                ఇందులో చెప్పబడిన విధముగా మరియమ్మ గర్భవతిగా ఉండుట గమనించిన యోసేపుకు కన్య మరియమ్మపై అనుమానము కలిగిందిఆమెకు రావలసిన నిందను తనపై వేసుకొనుటకు రహస్యముగా విడనాడాలని తలంచాడుదేవుని దూత ఆయనకు స్వప్నమందు ప్రత్యక్షమై క్రీస్తు ప్రభువు జనన విధానము తెలియజేసి బిడ్డకు పెట్టవలసిన పేరును తెలియజేయబడింది విధముగా యోసేపుయొక్క అనుమానము తీరి కన్య మరియమ్మ విషయములో బహు జాగరూకుడై వారికి పోషకుడుగా ఉన్నాడు.  (యూదా సీమలోని కొండ ప్రాంతముల వద్ద నుండి తిరిగి నజరేతుకు కన్య మరియమ్మ సుమారు నాలుగు నెలల కాలములో వచ్చిన తరువాత అనుమానము వచ్చినట్లుగా మనము గ్రహించాలిఈమె యూదయ సీమలోని కొండ ప్రాంతము నుండి నజరేతుకు వచ్చెనని ఎలా చెప్పగలములూకా 2:4-6లో గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమునకు వెళ్లాలి అంటే ముందు గలిలయలోని నజరేతుకు వచ్చియుండాలి కదా కారణము చేత కన్య మరియమ్మ గబ్రియేలు ద్వారా వర్తమానము పొంది గర్భము ధరించిన వెంటనే యూదా సీమలోని కొండ ప్రాంతములలో నివసించుచున్న ఎలీసబేతు వద్దకు వెళ్లి సుమారు మూడు నెలలు, రానుపోను ఒక నెల అనగా సుమారు నాలుగు నెలల కాలములో తిరిగి గలిలయలోని నజరేతుకు చేరుట జరిగిందిఅక్కడ సుమారుగా ఎనిమిదవ నెల ప్రారంభ కాలము వరకు నివసించింది.)
                కైసరు ఔగుస్తు చేసిన ప్రజా సంఖ్య నమోదు ఆజ్ఞ :-  లూకా 2:1-3.
                ఇందులో కైసరు ఔగుస్తు అను అధిపతి ద్వారా ప్రజాసంఖ్య వ్రాయబడాలన్న ఆజ్ఞ కలుగుట క్రీస్తు ప్రభువు పుట్టుక ముందు జరిగింది.  ( ఆజ్ఞ ఇచ్చునప్పటికి కన్య మరియమ్మకు ఇంకా నెలలు నిండలేదుఅప్పటికి వారు గలిలయలోని నజరేతులో ఉన్నారు.)

                ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు బెత్లెహేమునకు వెళ్లుట :-  లూకా 2:3.
                ఎప్పుడైతే ఆజ్ఞ ఇయ్యబడినదో యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక కన్య మరియమ్మ అందరి దృష్టిలో తనకు ప్రధానము చేయబడిన కన్య గనుక వారు గలిలయ నుండి బేత్లెహేమునకు అనగా దావీదు అను ఊరికి వెళ్లిరి.  (ఇలా వెళ్లుటకు ఇవేమి దగ్గర దూరాలు కావునజరేతు గలిలయ ప్రాంతములోనిదిబేత్లెహేము యూదయ ప్రాంతములోనిది కనుక ప్రసవ దినములకు అనేక దినములు ముందే వారు ప్రయాణమై బేత్లెహేము చేరుట జరిగింది.)

                కన్య మరియమ్మకు ప్రసవము - యేసుక్రీస్తును పశువుల తొట్టిలో ఉంచుట :-  లూకా 2:5-7.
                ఇందులో వారక్కడ ఉన్నప్పుడు కన్య మరియమ్మకు ప్రసవ దినాలు నిండినవి అనుటను బట్టి వారు యూదయలోని బేత్లెహేమునకు కొంచెం ముందుగానే చేరుకొనుట జరిగిందికాని ఎవరు మరియ తల్లి ఉండటానికి స్థలము తమ ఇండ్లలో ఇయ్యకపోవుట వలన సత్రములోను వారికి స్థలము లేనందున అక్కడ నిండుగ జనము ఉండిపోవుట వలన ఆమె తొలిచూలు కుమారుని కని పశువుల తొట్టిలో పరుండబెట్టుట జరిగింది.  (కన్య మరియ గర్భములో క్రీస్తు ప్రభువు సుమారు తొమ్మిది నెలల ఆరు రోజుల కాలమును పూర్తి చేసి జన్మించుట జరిగిందినవమాసములు నిండినవిఒక వారము రోజుల లోపలనే శిశువు జన్మించునని పూర్వీకులు చెప్పుకొనే మాటలు తొమ్మిది నెలల ఆరు రోజుల కాలమన్నది, శిశువు సంపూర్ణ పరిణతి చెంది జన్మించుటయని అంటున్నారు పై చెప్పబడిన కాలము లోపలనే జన్మించు శిశువులకు ఏమో బలహీనతలు చోటు చేసుకుంటాయి గనుక డాక్టర్లు శిశువుల విషయమై - ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం మనకు తెలిసినదే.)
                కన్య మరియమ్మ గర్భము ధరించిన తరువాత శిశువు పుట్టు వరకు ప్రయాణాలు, ఆమె ఉన్న ప్రాంతాలు.
                మొదటి ప్రయాణం - గలిలయలోని నజరేతు
                రెండవ ప్రయాణం - యూదయ సీమలోని కొండ ప్రాంతాలు (ఎలీసబెతు నివసించుచున్నది.)
                మూడవ ప్రయాణం - యూదయలోని బేత్లెహేము అనగా దావీదు పురమునకు (ఇక్కడ క్రీస్తు ప్రభువు జన్మించారు.)
                క్రీస్తు ప్రభువు పుట్టుకతో తోక వలె ప్రకాశించు నక్షత్రము ఆకాశము నందు కనబడుట - రాత్రివేళ గొఱ్ఱెల కాపరులకు ప్రభువు దూత వర్తమానము - పరలోక దేవదూతల సమూహములు భూమిపై స్తోత్రములు చెప్పుట :-  మత్తయి 2:1-2, లూకా 2:8-14, 15-20.
                ఇందులో మూడు రకముల సంఘటనలులూకా 2:6 వారక్కడ ఉన్నప్పుడు అని వ్రాయబడుటను బట్టి నిండు గర్భవతిని నజరేతు నుండి బేత్లెహేమునకు తీసుకొని వెళ్లుటకు కష్టమని ముందుగా బేత్లెహేము చేరుకొన్నట్లును తరువాత ప్రసవ దినములు నిండి మరియ తల్లి ప్రసవించినట్లు వ్రాయబడియున్నదిఅట్లే మత్తయి 2:2లో వ్రాయబడిన క్రీస్తు యొక్క వెలుగు నక్షత్ర రూపములో ప్రకాశించి ముగ్గురు జ్ఞానులను ప్రయాణమునకు సిద్ధపరచి శిశువు జన్మదినము నాటికి జ్ఞానులను నడిపిస్తూ వారికి శిశువు యొక్క దర్శనమును అనుగ్రహించినట్లు తెలుస్తున్నదిఅనగా నక్షత్ర కాంతి కొన్ని దినముల ముందుగా జ్ఞానులను నడిపించినట్లు తెలుస్తున్నది.  1.  ఆకాశములో తోక నక్షత్రము జ్ఞానులను నడిపించుటకు కొన్ని దినములకు ముందుగా వారిని సిద్ధపరచుటకు ఆకాశములో కనిపించింది.  2.  గొఱ్ఱెల కాపరులకు ప్రభువు దూత కనబడి వారికి క్రీస్తు ప్రభువును గూర్చి చెప్పింది.  3.  పరలోకములోని సైన్య సమూహములు స్తోత్రగీతములు పాడారు రెండు సంఘటనలు మాత్రమే ఒకేసారి ఒకే సందర్భములో జరిగినవిఆకాశములో కనిపించిన తోక నక్షత్రమును ముగ్గురు జ్ఞానులు చూచారుకనుకనే మత్తయి 1:1-2లో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచాము, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరికనుక ఇందులో వీరు చూచిన సమయము వేరు వీరు యెరూషలేమునకు వచ్చిన సమయము వేరుకనుక ఆకాశ నక్షత్రమును చూచి వారి జ్ఞానముతో లోకరక్షకుడు జన్మించాడని తెలుసుకొని వారు ప్రయాణమైన కొన్ని రోజుల తరువాత యెరూషలేము చేరారుఇక రెండవ సందర్భములో గొఱ్ఱెల కాపరులకు తెలియజేయగా వారు వెంటనే బేత్లెహేములో పశువుల పాకలో పశువుల తొట్టిలో పడుకొనియున్న శిశువును చూచి ఆనందించి స్తోత్రములు చేసారుఇక మూడవ సందర్భము కూడ రాత్రే జరిగిందిఇందులో దేవుని దూతలు ఆనందోత్సాహముతో దేవునికి స్తోత్రములు చెల్లించుట జరిగించారుఇలా మూడు రకములైన క్రియలు ఒకేసారి క్రీస్తు ప్రభువు పుట్టుకతో జరిగాయి.  (కాని తోక నక్షత్రము చూచినవారు అదే సమయములో బయలుదేరారుఇంకా చేరుటకు సమయము ఉన్నది.  కాని గొఱ్ఱెల కాపరులు దగ్గరలోనే ఉండుట వలన దేవుని దూతల వర్తమానము ఎరిగి వెళ్లి చూచి స్తుతించారుఅంటే పశువుల పాకలో పశువుల తొట్టిలో బేత్లెహేము ఊరిలో క్రీస్తు ప్రభువును చూచినది గొఱ్ఱెల కాపరులు వారితో కూడ మత్తయి 2:2 ఆయన నక్షత్రము అనగా క్రీస్తు వెలుగు జ్ఞానులకు కొన్ని దినములు ముందుగా ప్రయాణానికి సిద్ధపరచి వారిని సరిగ్గా శిశువు జన్మదినము నాటికి ముగ్గురు జ్ఞానులను కూడ నడిపించింది.)
                క్రీస్తు ప్రభువునకు సున్నతి - యేసు అని పేరు పెట్టుట :-  లూకా 2:21, మత్తయి 1-25.
                ఇందులో చెప్పబడిన విధము ఎనిమిదవ దినమున క్రీస్తు ప్రభువుకు సున్నతి చేసి దూత చెప్పబడిన విధముగా యేసు అను పేరు ఆయనకు పెట్టుట జరిగింది.  (యేసు అను పేరు పెట్టుటకు ఎనిమిదవ రోజు వచ్చిందిఇప్పటికి వీరు బేత్లెహేము నందు ఉన్నారు.)
                కన్య మరియమ్మ శిశువు యొక్క పెంపుడు తండ్రి యోసేపుతో బాటు మోషే ధర్మశాస్త్రము ప్రకారము శుద్ధి చేసికొనుట :-  లూకా 2:22-24.
                మోషే ధర్మశాస్త్రము ప్రకారము శుద్ధి చేసికొను దినములు - మగ బిడ్డ పుట్టినప్పుడు నలభైవ రోజు శుద్ధి చేయాలిలేవీయకాండము 12:3-4  ఇందుకోసము వారు యెరూషలేము ఆలయమునకు వెళ్లారుఅక్కడ వారు రెండు గువ్వల జతనైనను, పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించాలన్న తలంపుతో వెళ్లారు.  (ఇందునుబట్టి వీరు బేత్లెహేములో నలభై రోజులు ఉన్నారు తరువాత వారు శుద్ధి చేసికొనుటకు
అక్కడ నుండి యెరూషలేముకు వచ్చారు.)
                సుమెయోను అన్న అను ప్రవక్తి యేసును ప్రభువును చూచుట :-  లూకా 2:25-38.
                ఇందులో సుమెయోనుకు క్రీస్తును చూడక మునుపు మరణించడని పరిశుద్ధాత్మ చేత బయల్పరచియుండగా, ఆయన తన చేతులలో క్రీస్తు ప్రభువును ఎత్తుకొని దేవుని స్తుతించాడు తరువాత వారిని దీవించినాడుఅదే సమయములో అన్న అను ప్రవక్త్రి కూడ వచ్చి దేవుని కొనియాడి క్రీస్తు ప్రభువును గూర్చి మాట్లాడుచున్నదిఅలా వారు యెరూషలేములో మోషే ధర్మశాస్త్రము చొప్పున తమ విధిని నిర్వర్తించుకొన్నారు
                గలిలయలోని నజరేతుకు యెరూషలేము నుండి వెళ్లుట :-  లూకా 1:39.
                మోషే ధర్మశాస్త్రము ప్రకారము సమస్తమును తీర్చినట్లుగా చెప్పబడిందిదాని తదనంతరము వారు వారి స్వంత ఊరికి వెళ్లిపోయారు.  (బేత్లెహేము నుండి వారు శుద్ధి చేసుకొనుటకు యెరూషలేము వచ్చారుఅక్కడ ఒకటి లేక రెండు రోజులలో ధర్మశాస్త్రము ప్రకారము గావించి వారు నజరేతునకు వెళ్లిపోయారు.)  ఇక్కడ మనము గమనించవలసినదేమిటంటే ధర్మశాస్త్ర చట్ట ప్రకారముగా శిశువుకు 8 దినమున సున్నతి చేయబడిందిఅటు తరువాత రక్తస్రావ దినములు గడచి శుద్ధి చేసుకొను 40 దినమున దేవాలయ ప్రవేశము చేసినట్లు అక్కడ సుమెయోను అన్న అను ప్రవక్త్రి శిశువును తమ చేతులతో ఎత్తికొని దేవుని స్తుతించినట్లు వ్రాయబడి యున్నది.)
                ముగ్గురు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదును అడుగుట :-  మత్తయి 2:1-3.
                ఇందులో చెప్పబడిన విధముగా యేసు పుట్టిన తరువాత వారు తోక నక్షత్రమును చూచారుఅక్కడ నుండి బయలుదేరి ఎట్టకేలకు సుమారు నలువది రోజుల తరువాత యెరూషలేము చేరారుఅక్కడ వారికి విధముగా వెళ్లాలో అర్థము కాలేదుపైపెచ్చు యెరూషలేములో గాని బేత్లెహేములో గాని క్రీస్తు ప్రభువు లేడుకనుక యెరూషలేము చేరిన ముగ్గురు జ్ఞానులు హేరోదును అడిగి తెలుసుకొనుటకు వెళ్లారుఅక్కడ వారిని ప్రశ్నించారు.  (ఇది సుమారు క్రీస్తు ప్రభువుకు నలువది రోజుల వ్యవధిలో జరిగింది.)
                హేరోదు క్రీస్తు ఎక్కడ పుట్టునని విచారించుట :-  మత్తయి 2:3-5.
                ఇందులో చెప్పబడిన విధముగా వార్త విన్నవారు కలవరపడ్డారువెంటనే శాస్త్రులను ప్రధాన యాజకులను పిలిచి క్రీస్తు పుట్టుక యూదయ బేత్లెహేములో అని నిర్ణయించారు విధముగా అజ్ఞాన జనసమూహమునకు తెలిసింది.  (ఇది తెలియు నాటికి క్రీస్తు ప్రభువు బేత్లెహేములో లేడు విధముగా మరికొన్ని రోజులు గడిచాయి.)
                హేరోదు జ్ఞానుల యొద్ద నక్షత్రము కనబడిన కాలమును తెలుసుకొనుట - వారిని చూచి ఆరాధించి తనకు వర్తమానము తెండని బేత్లెహేమునకు పంపించుట :-  మత్తయి 2:6-8.
                ఇందులో చెప్పబడిన విధముగా హేరోదు బేత్లెహేములో అని నిర్థారించుకొని క్రీస్తు ప్రభువు ఉన్న ప్రాంతమును చూచి తనకు వర్తమానము తెమ్మని ముగ్గురు జ్ఞానులను పంపుట జరిగింది.  (అంటే హేరోదు క్రీస్తు ప్రభువు ఇంకా బేత్లెహేములో ఉన్నాడనుకొని ముగ్గురు జ్ఞానులను బేత్లెహేమునకు పంపుట జరిగింది.)
                నక్షత్రము మరల కనబడి వారికి దారి చూపుట :-  మత్తయి 2:9.
                ఇందునుబట్టి వారు తిరిగి వెదుకుచు బేత్లెహేము వైపు ప్రయాణము సాగించారువీరు తప్పు మార్గమున వెళ్లుచున్నారని దేవుడు కనికరించి వారికి తిరిగి నక్షత్రము కనబడునట్లు చేసి క్రీస్తు ప్రభువుఉన్న చోటికి మార్గము చూపుచు త్వరగా చేరునట్లు చేసాడు.  (కనుక హేరోదు దృష్టిలో వారు బేత్లెహేమునకు వెళ్లినట్లుగా లెక్కకాని వారి మార్గమును మార్చి వారిని గలిలయలోని నజరేతుకు నక్షత్రము నడిపించిందిఅంతేగాక  వారు ఊరికి వెళ్లారని వారు చూచుకొనలేదుకేవలము గుడ్డిగా నక్షత్రమును వెంబడించి క్రీస్తు ప్రభువు ఉన్న చోటుకు చేరుకొన్నారు.)
                ఇంటిలో ఉన్న యేసును పూజించుట :-  మత్తయి 2:10-11.
                ఇందునుబట్టి వారు క్రీస్తు ప్రభువును తల్లియైన మరియతో చూచి, వారిద్దరి ముందు సాగిలపడి నమస్కరించి చివరగా యేసు ప్రభువును పూజించి కానుకలు సమర్పించారు.  (వీరు చూచినది ఇంటిలో గాని సత్రములోని పశువుల తొట్టిలో కాదుఅలాగే యెరూషలేములోని దేవుని ఆలయములో కాదువారు ఇంటిలో చూచారు ఇల్లు వారికి గలిలయలోని నజరేతులో ఉన్నదిఅది యోసేపునకు చెందినదికనుక ముగ్గురు జ్ఞానులు సుమారు 50 - 60 రోజుల కాలములో నజరేతులో క్రీస్తు ప్రభువును చూచారు.)
                జ్ఞానులు వేరే మార్గమున వారి దేశమునకు వెళ్లుట :-  మత్తయి 2:12.
                ఇందునుబట్టి దేవుని దూత హేరోదు వద్దకు వెళ్లవద్దని ఆజ్ఞాపించగా స్వప్నమందు చెప్పినను వారు దానిని దైవాజ్ఞగా భావించి వారు మరో మార్గము ద్వారా వారి దేశానికి వెళ్లిపోయారు.  ( కాలమంతా హేరోదు ముగ్గురు జ్ఞానుల కోసము ఎదురు చూస్తూ ఉన్నాడుఅలా అనేక రోజులు గడుస్తున్నాయిహేరోదు బేత్లెహేమునకు వెళ్లినవారు అక్కడ జన్మించినవారిలో ఎవరు క్రీస్తు అని కనుగొనుట కష్టమని భావించుట వలన అనేక దినములు వారి రాక కోసము ఎదురు చూచాడుఇలా మరల ఒకటి లేక మూడు నెలలు గడిచి యుండవచ్చును.)
                ఐగుప్తుకు క్రీస్తు ప్రభువును తీసుకొని పారిపొమ్మని దూత స్వప్నమందు చెప్పుట :-  మత్తయి 2:13-15.
                ఇందునుబట్టి మనుష్యుల హృదయాలోచనలను ఎరిగిన దేవుడు యోసేపునకు ముందుగా తెలియజేయగా యోసేపు క్రీస్తు ప్రభువును తీసుకొని ఐగుప్తునకు పారిపోయి అక్కడ హేరోదు మరణము వరకు ఉన్నారు.  (ఒక ప్క్ర ముగ్గురు జ్ఞానులు వేరే మార్గములో ప్రయాణమై వారి దేశమునకు వెళ్లగా, రెండవ ప్రక్క కన్య మరియమ్మ, యేసుక్రీస్తు ప్రభువు, యోసేపు ముగ్గురు ఐగుప్తుకు వెళ్లి అక్కడ వారు తల దాచుకొనుట జరిగింది.)
                జ్ఞానులు తనని మోసగించారని హేరోదు తెలుసుకొనుట :-  మత్తయి 2:16.
                ఇందులో చెప్పబడిన విధముగా నెలలు గడుస్తున్నా జ్ఞానులు తిరిగి రాకపోవుట  వలన వారు తనని మోసగించారని తెలుసుకొన్నాడు.  (రాజు కదాతన సైనికులను పంపి ముగ్గురు జ్ఞానుల కోసము వెదికించి, వారు కనబడక పోవుట వలన వారు వచ్చి తెలియజేయగా తాను మోసపోయినట్లు గ్రహించి క్రోధితుడైయ్యాడు.)
                రెండు సంవత్సరముల లోపు పిల్లలను చంపించుట :-  మత్తయి 2:16-18.
                ముగ్గురు జ్ఞానులు మోసగించిరని ఎరిగిన హేరోదు బహు క్రోధితుడై రెండు సంవత్సరముల లోపు పిల్లలనందరిని బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోని మగ పిల్లల నందరిని వధించారు.  (రెండు సంవత్సరములు అనుటను బట్టి సుమారు  క్రీస్తు ప్రభువుకు ఆరు నెలల పైన ఒక సంవత్సరము లోపు వయస్సు కలిగియుండవచ్చును, ఎందుకంటే హేరోదు నక్షత్రము కనబడిన కాలమును ముగ్గురు జ్ఞానుల నుండి తెలుసుకొని దానిని బట్టి లెక్కించినప్పుడు సుమారు ఆరు నెలల నుండి ఒక సంవత్సరము కాలముకు లెక్కకు తేలియుండునుఎందుకైనా మంచిదని రెండు సంవత్సరముల కాలము లోపు  మగపిల్లలను చంపించుట చేసాడు.)
                ఐగుప్తు నుండి నజరేతుకు వచ్చుట :-  మత్తయి 2:19-23.
                ఇందునుబట్టి హేరోదు దైవశాపమును పసిబిడ్డల రక్తము వలన పొంది అనతి కాలములోనే చనిపోవుట జరిగిందిఅతని తరువాత అతని కుమారుడు అర్కెలాయు రాజుగా మారాడు కాలము సుమారు క్రీస్తు ప్రభువుకు మూడున్నర సంవత్సరము వయస్సు నందు జరిగియుండును కాలములో వారు గలిలయలోని నజరేతుకు వచ్చి జీవించారు.  (అంటే సుమారు మూడు సంవత్సరములు లేక మూడున్నర సంవత్సరములు ఆయన ఐగుప్తులో రహస్య జీవితమును జీవించారుదీనికి కారణము ప్రకటనలోని క్రూరమృగము కాలము వెయ్యిన్ని రెండు వందల అరువది దినాలు అనగా మూడున్నర సంవత్సరములు కాలములో పరిశుద్ధుల హింస జరుగు కాలముఅలాగే మూడున్నర సంవత్సరముల కాలము క్రీస్తు ప్రభువు తన సువార్తను కొనసాగించి చివరకు సిలువ బలియాగము చేసారుఅలాగే ప్రకటనలోని ఇద్దరు సాక్షులైన హానోకు ఏలీయాలు మూడున్నర సంవత్సరము సువార్త జరిగించి క్రూరమృగము చేత చంపబడుదురుఇందునుబట్టి ఐగుప్తులో మూడున్నర సంవత్సర కాలము ఉన్నట్లుగా మనము గ్రహించాలి తరువాత హేరోదు మరణించిరని తెలుసుకొనివారు తిరిగి గలిలయలోని నజరేతునకు వచ్చి జీవించారు.)
                బాలుడుగా నజరేతులో :-  లూకా 2:40.
                క్రీస్తు ప్రభువు శిశు దశ ఐగుప్తులో ముగియగా బాలుడుగా గలిలయలోని నజరేతుకు వచ్చి అక్కడ దేవుని దయ యందు వృద్ధి చెందుచున్నారు.
                ఏటేట యెరూషలేముకు వచ్చేవారు :-  లూకా 2:41-52.
                ఇందులో చెప్పిన విధముగా క్రీస్తు ప్రభువు యెరూషలేము ఆలయములో నిలిచిపోయినది పండ్రెండు సంవత్సరముల ప్రాయములో కాని వారు పస్కా పండుగకు ప్రతి సంవత్సరము వెళ్లేవారుఇలా ఎంతకాలము వెళ్లారు అనేది వ్రాయకపోయినను లూకా 2:41లో ఏటేటా అనుటను బట్టి వారు ప్రతి సంవత్సరము వెళ్లేవారని అర్థమగుచున్నది.  (క్రీస్తు ప్రభువుకు మూడున్నర సంవత్సర కాలము ఐగుప్తులో రహస్య జీవితము గడపగా, తరువాత సాధారణ జీవితమును కొనసాగించుట జరిగిందినీతికి మారురూపుడైన యోసేపు, కన్య మరియమ్మలు ఆయనను ప్రతి సంవత్సరము యెరూషలేమునకు తీసుకొని వచ్చేవారుయోసేపు పండ్రెండు సంవత్సరముల అనంతరము మరణించినట్లుగా భావించాలిమిగిలిన సంవత్సరములు అనగా క్రీస్తు ప్రభువుకు ముప్పది సంవత్సరముల వయస్సు వరకు ప్రతి యేటా ఆయన పస్కా పండుగకు వెళ్లేవాడని ఏటేటా అను పదము మనకు తెలియజేస్తున్నది తరువాత కూడ ఆయన పండుగకు వెళ్లినట్లుగా బైబిలు గ్రంథములో వ్రాయబడియున్నదియోహాను 10:22.)
                విశ్రాంతి దినము నందు సమాజ మందిరములోనికి వెళ్లి గ్రంథమును చదువుట :-  లూకా 4:16-21.

                ఇందులో తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి, చదువుటకు నిలుచుండగా అని చెప్పుటను బట్టి క్రీస్తు ప్రభువు ప్రతి శనివారము ధర్మశాస్త్రము ప్రకారము విశ్రాంతి దినము కనుక దినమున ఆయన గ్రంథమును చదువుటకు నిలిచేవాడుఇలా క్రీస్తు ప్రభువు ముప్పది సంవత్సరముల కాలము గడిచిందిఇది వాడుకగా జరిగేదిబాప్తిస్మము పొందిన తరువాత ఆయన నజరేతులోని సమాజ మందిరమునకు వెళ్లినట్లుగా వ్రాసినను అది వాడుకగా ఆయన వెళ్లుచున్న ప్రకారము వెళ్లాడని చెప్పుటను బట్టి ఆయన తన యవ్వన కాలములో సమాజ మందిరములలో యాజకులు ఇచ్చిన గ్రంథమును చదివి వినిపించేవాడుఅలాగే అందులోని అర్థమును వివరించేవారు, ఎందుకంటే ఆయన చదివిన తరువాత పరిచారకులకు గ్రంథము చుట్టి ఇచ్చాడుఅప్పుడు అక్కడ వారందరు ఆయన ఏమి చెప్పునో అని ఆయన వైపు తేరి చూచుటను బట్టి ఆయన తన యవ్వన వయస్సు నుండే బోధించేవాడని అర్థమగుచున్నదిఅలాగే లూకా 2:41-52లో ఆయన పండ్రెండు సంవత్సరముల ప్రాయములోనే ఆయనకు ఉన్న జ్ఞానమునకు యెరూషలేము దేవాలయములోని వారు ఆశ్చర్యచకితులైయ్యారుఅలాగే లూకా 4:16లో తాను పెరిగిన నజరేతు అని చెప్పుటను బట్టి క్రీస్తు ప్రభువు నజరేతులో పెరిగినట్లుగా గ్రహించాలి.  (ఇందునుబట్టి క్రీస్తు ప్రభువుకు నాలుగు సంవత్సరముల వయస్సు నుండి ప్రతి సంవత్సరము పస్కా పండుగను ఆచరించుటకు యెరూషలేము ఆలయమునకు వచ్చేవారుఅలాగే నజరేతులోని సమాజ మందిరములో తాను గ్రంథము చదువుటకు ప్రతి వారములోని విశ్రాంతి దినమందు చేరి అక్కడ చదివి దానిని బోధించుచుండేవారుఅలా ఆయనకు ముప్పది సంవత్సరముల కాలము గడిచిందికనుక యేసు నజరేతులో ముప్పది సంవత్సరముల వయస్సు వరకు పెరిగినట్లుగా గ్రహించాలి.)

1 comment :

  1. Studies indicate that when people connect with the Bible at least four days a week, they’re much more likely to experience positive life changes. We designed the Bible App to make it easy for you to engage with God’s Word every day. Holy bible app

    ReplyDelete