పరలోకమును భూలోకమును సృస్టించిన సర్వ శక్తి గల పిత అయిన సర్వేశ్వరా
మిమ్ము పొగడుచున్నము! మిమ్మునారాధించుచున్నాము! మిమ్ము ఘనపరచు చున్నాము! మీరు లేనిధే
నేను లేను. మిమ్ము వీడి వుండుట వ్యర్ధము. మీరులేని నా జీవితము ఆగమ్య గోచరము. గమ్యము
లేని జీవితమనే నా నావలో పయనించేకన్నమీరు పయనిస్తున్న నావలో విశ్రమించుట మేలు. నన్నును
నా కుటుంబాన్ని మీ నావలో పయనింపనివ్వండి.
Nadipinchu Naa Naavaa Nadisandramuna Devaa | Play with Mobile Phone |
నడిపించు నా నావా! నడిసంద్రమున దేవా!
నవ జీవన మార్గమున! నా జన్మ తరియింప!
నా జీవిత తీరమున, నా అపజయ భారమునా,
నలిగిన నా హృదయమును, నడిపించుము లోతునకు,
నా యాత్మ విరబూయా, నా దీక్ష ఫలియింపా
నా నావలో కలిడుమూ, నా సేవ చేకొనుమా
నడిపించు నా నావా...
రాత్రంతయు శ్రమ పడినా, రాలేదు ప్రభు జయము
రహదారులు వెదికిననూ, రాదాయను ప్రతి ఫలము
రక్షించు నీ శిలువా
నడిపించు నా నావా...
ఆత్మార్పణ చేయకనే, ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే, అరిసితే ప్రభు నీ కలిమి
ఆశా నిరాశాయే, ఆవేదన నిదురాయే
ఆద్యాత్మిక లేమి గని, అల్లాడే నా వలలు
నడిపించు నా నావా...
ప్రభు మార్గము విడచితిని, ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని, పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో, ప్రావీణ్యము పొందీ,
ఫలహీనుడై ఇపుడు, పాటింతు నీ మాటా
నడిపించు నా నావా...
లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి, లోపంబులు సవరించి
లోతున్న ఈపులలో, లోటైన నా బ్రతుకు
లోపించని అర్పణగా, లోకేశ చేయుమయా..
నడిపించు నా నావా...
ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు ప్రేమను పాడుకొని
ప్రకటింతును లోకములో, ఓ పరిశుద్దుని ప్రేమ కధ
పరమాత్మ ప్రోక్షణతో, పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబులు ప్రభు కొరకు, ప్రాణార్పణము చేతు
నడిపించు నా నావా...
No comments :
Post a Comment