Thursday, November 5, 2015

ఏం చేసానయ్య నీ కోసం ఈ బ్రతుకు నిచ్హావని

ఏం చేసానయ్య నీ కోసం ఈ బ్రతుకు నిచ్హావని
ఏం మోసానయ్య నీ కోసం నీవు నన్ను చూచావని
ఒక్కరినైనా... ఒక్క ఆత్మ నైనా... రక్షించానా... నీకై వెలిగించానా...?

జ్ఞానం మిచ్చావయ్య... బుద్ది నిచ్చావయ్య... మాట నిచ్చావయ్య... నాకు బ్రతుకు నేర్పావయ్య
ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరిచాన... నిన్నే ఎదిరించానా ?
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్య... నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్య... || ఏం చేసానయ్య||

ధనము నిచ్చావయ్య... ఘనత నిచ్చావయ్య... శ్రద్ధ నిలిపావయ్య... పోషింప చేసావయ్య...
ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా...? నే నా కడుపు నింపుకొన్నాన...?
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్య... నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్య... || ఏం చేసానయ్య||

ఇల్లు నిచ్చావయ్య... మా అనుగు నిచ్చావయ్య... ఆధ్య మిచ్చావయ్య... నాకు సుఖము నిచ్చావయ్య...
ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించాన ? సోమరినై పోయానా
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్య... నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్య... || ఏం చేసానయ్య||

No comments :

Post a Comment