Pages

Pages

Wednesday, January 13, 2016

నేనెందుకని నీ సొత్తుగా మారితిని


నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసీమ

1. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును

2. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే
నా తనువందున శ్రమలుసహించినీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును 

3. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును